బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాకు సబంధించి రోజుకో రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అలానే ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ సారి రిలీజ్ డేట్ విషయంలో. ఈ సినిమాను జులై 30, 2020 న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ను జులై 30 నుండి అక్టోబర్ 2వ తేదీకి మార్చాలని చూస్తున్నారట. మరి ఈ వార్తలైతే వినిపిస్తున్నాయి.. వీటిలో ఎంత నిజముందో తెలియాలంటే మళ్ళీ రాజమౌళి నే చెప్పాలి.
కాగా స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో దానయ్య డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























