వర్మ తర్వాత సినిమా వరుణ్ తోనా..?రాజ్ తరుణ్ తోనా..?

Virinchi Varma to Direct Young Hero

‘118’ ఘనవిజయం తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఎప్పటినుండో విరించి వ‌ర్మ‌ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సినిమా చేస్తునట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. `ఉయ్యాలా జంపాలా`, `మ‌జ్ను` చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ని వార్త‌లు అప్పట్లో బలంగా వినిపించాయి.

అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా లేనట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం తను బిజీగా ఉండటంతో ఆయనతో తర్వాత సినిమా చేస్తానని చెప్పాడట కళ్యాణ్ రామ్. దీనితో ఈ లోపు మరో సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడట వర్మ. ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ్, రాజ్ తరుణ్ లతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఓకే చెప్తే తన నెక్స్ట్ సినిమా వారితో చేయనున్నాడట. మరి చూద్దాం ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.