‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా..!

టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘అర్జున్ సురవరం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మాత్రం రిలీజ్ కష్టాలు మాములుగా రాలేదు. పలుమార్లు రిలీజ్ డేట్ వేసుకొని. నవంబర్ 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 26 వ తేదీన హైద్రాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఇక ఈ సినిమాకు ముఖ్య అతిథిగా ఓ స్టార్ ను రానున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు మెగా స్టార్ చిరంజీవి.

కాగా ఈసినిమాలో నిఖిల్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ ఎల్ఎల్పీ &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి అక్కడ సూపర్ హిట్ అయిన ఈసినిమా ఇక్కడ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.