అల్లు అరవింద్ సమర్పణ లో గీతా ఆర్ట్స్ , యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ డిసెంబర్ 20వ తేదీ రిలీజ్ కానుంది. ప్రతి రోజూ పండగే మూవీ సెకండ్ సింగిల్ ఓ బావా సాంగ్ ప్రసాద్ ల్యాబ్ లో రిలీజయిన సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా తో సమావేశమయ్యారు. హీరో సాయి తేజ్ మాట్లాడుతూ .. మీడియా నుండి అద్భుతమైన సపోర్ట్ వస్తుందని, థమన్ మంచి సంగీతం అందించారని, ఈ మూవీ అందరినీ అలరిస్తుందని, మనల్ని మనం ప్రశ్నించుకొనే చిత్రమిదనీ అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు మారుతి మాట్లాడుతూ .. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకూ రాని పాయింట్ తో ప్రతి రోజూ పండగే మూవీ రూపొందిందని, కుటుంబం లో ఒకరు పుట్టినపుడు ఎంత సంతోషంగా ఆహ్వానిస్తున్నామో, పెద్దవారి చివరి రోజులలో అంతే సంతోషంగా వీడ్కోలు పలకాలనే కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే చిత్రమని అన్నారు. దర్శకుడు మారుతి ని నమ్మి ఈ మూవీ నిర్మించామనీ, మారుతి టైమింగ్ పై నమ్మకం ఉందని, రాశీ ఖన్నా అద్భుతంగా నటించారని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ ..తనకు ఇష్టమైన క్యారెక్టర్ లో నటించానని, తన క్యారెక్టర్ ను అందరూ ఇష్టపడతారని, ఓ బావా సాంగ్ తన కు ఇష్టమైన సాంగ్ అనీ అన్నారు. ఓ బావా సాంగ్ లిరిసిస్ట్ కేకే మాట్లాడుతూ .. ఈ మూవీ లోరెండు సాంగ్స్ రాసే అవకాశం కల్పించిన బన్నీ వాసు గారికి థ్యాంక్స్ అన్నారు. డాన్స్ డైరెక్టర్ యశ్ మాట్లాడుతూ .. మారుతి గారికి థ్యాంక్స్ అని, ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని అన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: