సంక్రాంతి పండుగ కు రిలీజ్ అయిన సినిమాలు కలెక్షన్స్ కొల్లగొడతాయి. సినిమాలు చూసి ప్రజలు సంక్రాంతి పండుగ సెలవులు ఎంజాయ్ చేస్తారు. అందుకే నిర్మాతలు తమ మూవీస్ ను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. 2020 సంవత్సరం సంక్రాంతికి రెండు భారీ తెలుగు చిత్రాలు, డబ్బింగ్ మూవీ విడుదలకు సిద్ధం అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ, ట్యాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన అల .. వైకుంఠ పురములో .. మూవీ, సూపర్ స్టార్ రజనీకాంత్ , నయనతార నటించిన దర్బార్ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ దర్బార్ మూవీ సంక్రాంతి బరిలో ఉన్నాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్ చిత్రాలు జనవరి 12 వ తేదీ రిలీజ్ కానున్నాయని వార్తలు వచ్చాయి. వరుస సూపర్ హిట్స్ తో విజయకేతనం ఎగురవేస్తున్న మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, చాలా గ్యాప్ తరువాత అల్లు అర్జున్ నటించిన అల .. వైకుంఠపురములో .. మూవీస్ పై ప్రేక్షక, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలను ఒకే రోజు రిలీజ్ చేసేకంటే ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ చేస్తే మంచిదని నిర్మాతలు భావించి, సరిలేరు నీకెవ్వరు మూవీ జనవరి 11 వ తేదీ , అల .. వైకుంఠపురములో .. మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ చేయనున్నారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: