లెజండరీ యాక్ట్రెస్, తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా పలు బయోపిక్ మూవీస్ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రియదర్శిని దర్శకత్వంలో జయలలిత గా నిత్యా మీనన్ నటిస్తున్న ‘ది ఐరన్ లేడీ’, AL విజయ్ దర్శకత్వం లో జయలలిత గా కంగనా రనౌత్ నటిస్తున్న ‘తలైవి’ మూవీస్ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్నాయి. ఇద్దరు ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ లు నిత్యా మీనన్, కంగనా రనౌత్ జయలలిత బయోపిక్ మూవీస్ లో జయలలిత పాత్రలో నటిస్తున్నారు. .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళనాడు ప్రజల ఆరాధ్య దేవత, స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ లో నటిస్తున్న నిత్యా మీనన్ మాట్లాడుతూ … బయోపిక్ ఆఫర్ కు ముందే జయలలిత గారి ఇంటర్వ్యూస్ చాలా చూశానని, ఆమె చుట్టూ కుట్రలు జరుగుతున్నా వాటిని ఎదుర్కొని స్ట్రాంగ్ లీడర్ గా నిలిచారని, జయలలిత గారి గురించి పలు విషయాలు తెలుసుకున్నానని, ఆమె అలవాట్లు, మాట తీరు, సమయపాలన, మేనరిజమ్స్
వంటి వాటితో తనకు చాలా పోలికలు ఉన్నాయని, ది ఐరన్ లేడీ మూవీ దర్శకురాలు ప్రియదర్శిని వద్ద జయలలిత కు సంబంధించిన ఎవరికీ తెలియని పలు విషయాలు ఉన్నాయని, ఈ మూవీ పై తనకు కాన్ఫిడెన్స్ ఉందని, జయలలిత గొప్పతనం గురించి అందరికీ తెలియజేయాలనే ఈ మూవీ రూపొందుతుందనీ, ‘ది ఐరన్ లేడీ’ మూవీ ఏ మూవీ కి పోటీ కాదని నిత్యా మీనన్ తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























