సక్సెస్ ఫుల్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం లో సపోర్టింగ్ రోల్ లో నటించిన విజయ్ దేవరకొండ సూపర్ హిట్ మూవీ పెళ్ళిచూపులు తో హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ అర్జునరెడ్డి మూవీ తో సెన్సేషనల్ హీరోగా మారి బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీతో స్టార్ హీరోగా ఎదిగారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ తరువాత పూరి జగన్నాథ్ మూవీకి విజయ్ కమిట్ అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ ఫైటర్ మూవీ రూపొందనుంది. జనవరిలో సెట్స్ పైకి వెళుతున్న ఫైటర్ మూవీ లో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తారు. అందుకోసం ఆహార నియమాలు, జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తున్నానని విజయ్ తెలిపారు. ఫైటర్ మూవీ లో విజయ్ కు జోడిగా అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ డేట్స్ ను పూరి జగన్నాథ్ ట్రై చేస్తున్నారు. ఫైటర్ మూవీ తరువాత హీరో, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందే మూవీ కి విజయ్ కమిట్ అయ్యారు. టాలీవుడ్ లో ఇలా వరుస సినిమాలతో విజయ్ బిజీ హీరోగా మారారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: