సరిలేరు నీకెవ్వరు మూవీ సాంగ్స్ అదుర్స్

Sarileru Neekevvaru Songs Will Rock Mahesh Babu Fans DSP Says,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,DSP Promises Mahesh Babu Fans,Music Composer Devi Sri Prasad Promises to Super Star Fans,Devi Sri Prasad Latest News 2019,Sarileru Neekevvaru Songs

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. నేనొక్కడినే మూవీ తో దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ టైమ్ మహేష్ మూవీ కి సంగీతం అందించారు. ఆ మూవీ సక్సెస్ కాకపోయినా దేవిశ్రీ సంగీతం ప్రేక్షకులను అలరించింది. తరువాత దేవిశ్రీ సంగీతం అందించిన శ్రీమంతుడు మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ మూవీస్ భరత్ అనే నేను, మహర్షి లకు దేవిశ్రీ సంగీతం అందించారు. ఆ మూవీస్ ఘనవిజయం సాధించినా దేవిశ్రీ సంగీతం ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సరిలేరు నీకెవ్వరు మూవీ లో తాను కంపోజ్ చేసిన సాంగ్స్ ఫ్యాన్స్ ను అలరిస్తాయని దేవిశ్రీ ప్రసాద్ ప్రామిస్ చేశారు. సరిలేరు నీకెవ్వరు మూవీ లో సాంగ్స్ గురించి ఆ మూవీ నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర దేవిశ్రీ ను ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. ఈ మూవీ లోని మాస్ సాంగ్ విన్నతరువాత దేవిశ్రీ సంగీతం కేక అనేది చిన్న పదం అని, దేవిశ్రీ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇచ్చిన ప్రామిస్ నిలుపుకున్నారని,
సరిలేరు నీకెవ్వరు మూవీ సాంగ్స్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను అలరించనున్నాయని అనిల్ సుంకర ట్వీట్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానున్న సరిలేరు నీకెవ్వరు మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.