మాజీ నక్సలైట్ దగ్గర సాయి పల్లవి శిక్షణ…

Sai Pallavi Training under an ex naxalite,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Lalu Prasad Biopic Latest News,Sai Pallavi trains under an ex-naxal leader,Ex-naxal leader is training Sai Pallavi,Virata Parvam Movie Updates

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్నట్టుగా తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా సాయిపల్లవి పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే.. నక్సలైట్ గా ఒదిగిపోయి నటించేందుకు సాయి పల్లవి..ఓ మాజీ నక్సలైట్ తో ఆమెకు శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అడవుల్లో నక్సలైట్స్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది.. ప్రతికూల పరిస్థితుల్లో వారు ఎలా ఉంటారు..లాంటి విషయాల్లో సాయి పల్లవి శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. .

కాగా 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫిగా పనిచేస్తున్నారు.

ఇంకా ఈసినిమాలో ఈ చిత్రంలో నందితా దాస్, ఈశ్వరి రావు, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు….

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.