ఇప్పటికే ఎంతో మంది పెద్ద దిక్కును కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు మరో పెద్ద దిక్కును కోల్పోయింది. పాతతరం నటీనటుల్లో ఇప్పటికే ఎంతోమంది దివికెగిశారు. ఈ రోజు సీనియర్ నటి గీతాంజలి(62)కన్నుమూశారు. నిన్న ఆమెకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించారు. అయితే ఆమెకు రాత్రి మరోసారి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఇక గీతాంజలి మృతి పట్ల తెలుగు సినీపరిశ్రమ సంతాపం తెలియస్తుంది. పలువురు సినీ ప్రముఖులు నందినగర్‌లోని గీతాంజలి నివాసంలోఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి 1961లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె సీత పాత్రలో నటించి మెప్పించారు. కాలం మారింది, పూల రంగడు, శారద, డాక్టర్ చక్రవర్తి, పూలరంగడు, మురళీకృష్ణ, అవేకళ్లు, సంబరాల రాంబాబు, కలవారి కోడలు, గుఢచారి 116, దేవత, నిండు హృదయాలు వంటి హిట్ సినిమాల్లో నటించి మంచిపేరు సంపాదించారు. కథానాయికగానే కాదు హాస్యనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్రను వేశారు. తమన్నా ప్రధాన పాత్రలో వస్తున్న ‘దటీజ్ మహాలక్ష్మి’ ఆమె ఆఖరి చిత్రం. గీతాంజలి నంది అవార్డు కమిటీ మెంబర్‌గా కూడా పనిచేయడమే కాకుండా… మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఎంతోకాలంగా సేవలందించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























