`దొంగ‌`గా కార్తి?

Karthi Plays Thief In Khaidi Movie,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Karthi Role Revealed in Khaidi Movie,Karthi interesting Role in Khaidi Movie,Karthi Khaidi Movie Latest News

యువ క‌థానాయ‌కుడు కార్తి తాజా చిత్రం `ఖైదీ` నేడు జ‌నం ముందుకు వ‌చ్చింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో యావ‌జ్జీవ ఖైదీ దిల్లీగా కార్తిగా క‌నిపించాడు. క‌ట్ చేస్తే… త‌న త‌దుప‌రి చిత్రం కూడా థ్రిల్ల‌ర్ బాట‌లోనే వెళ్ళ‌నుంది. అయితే… ఈ సారి ఫ్యామిలీ థ్రిల్ల‌ర్‌తో కార్తి ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. `దృశ్యం` మల‌యాళ వెర్ష‌న్‌ని (ఇంకా చెప్పాలంటే ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌) రూపొందించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కార్తి వ‌దిన జ్యోతిక ఇందులో అత‌నికి అక్క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. స‌త్య‌రాజ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కాగా… ఈ సినిమాకి సంబంధించిన త‌మిళ టైటిల్ ఇంకా ఫిక్స్ కాక‌పోయినా, తెలుగు వెర్ష‌న్‌కి మాత్రం `దొంగ‌` అనే టైటిల్ ఖ‌రారు చేశార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ టైటిల్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొత్తానికి `ఖైదీ`, `దొంగ‌`… ఇలా మెగాస్టార్ చిరంజీవి టైటిల్స్‌ని కార్తి బాగానే టార్గెట్ చేసుకుంటున్నాడ‌న్న‌మాట‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.