తుఫాను బాధితులకు ‘తలైవా’ సాయం

Rajinikanth Shows His Kind Nature Again,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019,Telugu Filmnagar, Tollywood Cinema News,Rajinikanth Latest News 2019,Superstar Rajinikanth proves Is A People’s Man,Rajinikanth New Movies

తమిళ తంబీలపై తనకున్న ప్రేమను మరోసారి చూపించారు సూపర్ స్టార్ రజినీకాంత్. తుఫాను బాధితులకు మరిసారి ఆపన్న హస్తం అందించారు.. అసలుసంగతేంటంటే… తమిళనాడులో తుఫాను కారణంగా చాలా మంది తమ ఇళ్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రజినీకాంత్ నాగపట్నానికి చెందిన పది కుటుంబాలకు ఇళ్లను ఇవ్వడం జరిగింది. అంతేకాదు వారిని తమ ఇంటికి పిలిపించి.. ఇంటికి సంబంధించిన పాత్రలను వాళ్లకు ఇచ్చి తమ ఉదార స్వభావాన్ని చూపించారు. దీనితో రజినీపై కూడా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజానికి రజినీ ఇలా చేయడం మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రజినీ ప్ర‌స్తుతం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ర్బార్ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుంది. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్‌కు జోడీగా ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమిది కావడం విశేషం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మరో సినిమాను లైన్ పెట్టినట్టు తెలుస్తుంది. అజిత్‌తో వ‌రుస‌గా నాలుగు మాస్ మ‌సాలా సినిమాలు చేసి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్న.. శివ‌తో రజినీ తర్వాత సినిమా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి రజినీ ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఫుల్ జోష్ తో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.