`సరిలేరు నీకెవ్వరు`… విల‌న్ హౌస్ షెడ్యూల్ పూర్తి

Sarileru Neekevvaru Movie Latest Schedule Wrapped Up,2019 Latest Telugu Movie News, Mahesh Babu Sarileru Neekevvaru Movie Latest News, Sarileru Neekevvaru Movie Next Schedule Updates, Sarileru Neekevvaru Movie Shooting Updates, Sarileru Neekevvaru Movie Latest NewsTelugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న‌ ఈ సినిమాని అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్ర‌లో దర్శనమివ్వనున్నారు. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మానందం, సంగీత ముఖ్య భూమిక‌లు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించిన విలన్ హౌస్ షెడ్యూల్‌ పూర్త‌య్యింద‌ని, ఫైన‌ల్ షెడ్యూల్ కోసం ఛార్జ్ అవుతున్నామ‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

కాగా… చివరి షెడ్యూల్ కోసం యూనిట్‌ నవంబర్ 1 నుంచి కేరళకు పయనమవనున్నట్టు… అక్కడ నిరవధికంగా సాగే ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు స‌మాచారం.

దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌సార‌థ్యంలో రూపొందుతున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు`… 2020 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.