టాలీవుడ్ లో తక్కువ టైమ్ లోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో ఎవరంటే వెంటనే విజయ దేవరకొండ అని గుర్తొస్తుంది. వరుస హిట్లతో..వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా ఈ హీరో `టర్మినేటర్` సిరీస్ లో చివరి పార్ట్ అయిన `టర్మినేటర్ డార్క్ ఫేట్` పార్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. జేమ్స్ కెమరూన్ నిర్మించిన ఈ సినిమాను నవంబర్ 1న ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. సైరా, సాహో లాంటి సినిమాలు ఇంగ్లీష్ లో డబ్ చేయాలని.. హాలీవుడ్ ఆడియన్స్ కు మన తెలుగు సినిమాలను కూడా చూపించాలని అన్నాడు. అంతేకాదు.. టర్మినేటర్ లాంటి సినిమాల్లో ప్రభాస్ లాంటి హీరోలు చేయాలని కూడా సూచించాడు. మరి విజయ్ అన్నట్టు ఆ రోజులు కూడా తొందర్లోనే రావాలని.. హాలీవుడ్ స్థాయి కి కూడా మన తెలుగు సినిమాలు వెళ్లాలని కోరుకుందాం.
కాగా విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ ‘వరల్డ్ ఫెమస్ లవర్’ అనే రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ‘ఫైటర్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: