బాలీవుడ్ మూవీ రీమేక్‌లో నాగార్జున?

Nagarjuna To Act In Bollywood Remake Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,King Nagarjuna Bollywood Remake Movie,Akkineni Nagarjuna Upcoming Remake Movie,Nagarjuna Latest News 2019

వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా త‌న‌దైన ముద్ర‌వేశారు ‘కింగ్’ నాగార్జున. ప్ర‌స్తుతం `స్టార్ మా` టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్ బాస్3’కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగ్‌… స‌ద‌రు రియాల్టీ షో పూర్త‌వ‌గానే త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని టాక్‌. అంతేకాదు… ఓ బాలీవుడ్ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం ఉంటుంద‌ని తెలిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… హిందీనాట విజ‌యం సాధించిన‌ పిరియాడిక్ యాక్ష‌న్‌ క్రైమ్ థ్రిల్లర్ ‘రైడ్’(2018)ను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా, ఈ సినిమాకి సంబంధించిన తెలుగు రీమేక్‌ రైట్స్‌ను ఏషియన్ సినిమాస్ సంస్థ అధినేత సునీల్ నారంగ్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. 80ల్లో జరిగిన ఒక యదార్ధ ఘటన ఆధారంగా తెరకెక్కిన ‘రైడ్’లో అజయ్… ఐ.ఆర్‌.ఎస్‌. (ఇండియ‌న్ రెవెన్యూ స‌ర్వీస్‌) ఆఫీసర్‌గా దర్శనమిచ్చాడు. ఇప్పుడా పాత్ర‌లోనే నాగార్జున న‌టించ‌బోతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ద‌ర్శ‌కుడు, ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి… మ‌రింత స్ప‌ష్ట‌త వచ్చే అవ‌కాశ‌ముంది.

మ‌రోవైపు `సోగ్గాడే చిన్ని నాయ‌నా` సీక్వెల్ చేసే దిశ‌గానూ నాగ్ స‌న్నాహాలు చేస్తున్నారు. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌… ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.