శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా సామజిక సందేశం నేపథ్యంలో చిరంజీవి 152 వ మూవీ రూపొందనుంది. శృతి హాసన్ కథానాయిక, ఇతర ముఖ్య పాత్రలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ హీరో ఆర్య నటించనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన సినిమాలకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తానే సమకూర్చుకొనే కొరటాల శివ, చిరంజీవి 152 వ మూవీ కి మరో స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ సహకారం తీసుకొంటున్నారు. ఈ మూవీ లో కొంత డైలాగ్ పార్ట్ కు సాయి మాధవ్ వర్క్ చేయనున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి, మహానటి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు డైలాగ్స్ అందించిన సాయి మాధవ్, చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెం 150, సైరా నరసింహారెడ్డి
మూవీస్ కు డైలాగ్ రైటర్ గా పనిచేశారు. ఇద్దరు ప్రతిభావంతులు రైటర్స్ గా పనిచేసే చిరంజీవి 152 వ మూవీ లో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయనడం లో సందేహం లేదు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: