ఓ బేబీ సినిమాతో ఇటీవలే మంచి సక్సెస్ అందుకున్న నందిని రెడ్డి తన తర్వాత ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన తర్వాత సినిమాను స్వప్నా సినిమాస్ బ్యానర్‌పై చేయబోతుతుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడని వార్తలు కూడా వస్తున్నాయనుకోండి. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గతకొద్ది రోజులుగా నందినిరెడ్డి నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన `లస్ట్‌స్టోరీస్`ను తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి విదితమే. అంతే కాదు ఈ వెబ్‌సిరీస్‌లో అమలాపాల్ నటించబోతోందన్న వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ఈ రూమర్స్ పై తన ట్విట్టర్ ద్వారా స్పందించిన నందిని… `సబ్ టైటిల్స్ ఉన్న `లస్ట్ స్టోరీస్`ను రీమేక్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు. ఎందుకమ్మా.. ఏంటో ఈ వెరైటీ రూమార్స్` అంటూ ట్వీట్ చేశారు. మరి ఈ క్లారిటీతో అయినా రూమర్స్ కు చెక్ పడుతుందేమో చూద్దాం..
So why exactly would Netflix want to “remake” Lust stories which already have subtitles????? Why amma 🧐….. yento ee variety rumours 😒
— Nandini Reddy (@nandureddy4u) October 10, 2019
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























