యంగ్ హీరోలు కూడా ఏడాదికి ఒక సినిమా తీయడానికే చాలా కష్టపడుతుంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం అసలు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. హిట్లు, ప్లాప్స్ తో సంభందం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ వెళ్తున్నారు. గత ఏడాది 2.0 ఆ తర్వాత కాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి పేట సినిమాను రిలీజ్ చేసి ఈ యేడాదిని ప్రారంభించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తర్వాత కూడా అసలు ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా దర్బార్ సినిమాను లైన్ లో పెట్టేశాడు రజినీ. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుంది. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్‌కు జోడీగా ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమిది కావడం విశేషం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఇప్పుడు దర్బార్ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగులో శౌర్యం సినిమాతో దర్శకుడిగా మారిన శివ.. ఆ తర్వాత తమిళంలో అజిత్‌తో వరుసగా నాలుగు మాస్ మసాలా సినిమాలు చేసి కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించాడు. చివరగా విశ్వాసం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన శివ..ఇటీవలే రజనీకి కథ చెప్పగా… రజినీ ఓకే చెప్పారంటా. ఇక ఈ భారీ బడ్జెట్ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతునట్టు తెలుస్తుంది.
మరి ఏడు పదుల వయసుకు దగ్గరపడుతున్నా కూడా యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీనిస్తూ ఉత్సాహంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. నిజానికి రజినీ పొలిటికల్ ఎనౌన్స్‌మెంట్ తరువాత సినిమాలకు దూరమవుతాడని అంతా భావించారు. కానీ విచిత్రంగా రజనీ మాత్రం అందరికీ షాక్ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మరి రజినీని చూసి నేటి హీరోలు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది మరి. రజినీని ఏడాదికి రెండు సినిమాలు చేస్తుంటే.. యంగ్ హీరోలు కనీసం నాలుగైదు సినిమాలు చేయొచ్చు. చూద్దాం ఆ రకంగా మన హీరోలు అప్ డేట్ అవుతారేమో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























