డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకుంటూ , వరుస విజయాలతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రినైసెన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందనున్న స్పోర్ట్స్ డ్రామా మూవీ 10 వ తేదీ పూజ కార్యక్రమాలు జరుపుకుంది. ఈ మూవీ లో వరుణ్ బాక్సర్ గా నటిస్తున్నారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండు నెలల బాక్సింగ్ ట్రైనింగ్ కై వరుణ్ తేజ్ ముంబై కి పయనమయ్యారు. ఇంతకు ముందు ఒలింపిక్ విన్నర్ టోనీ జెఫ్రీస్ పర్యవేక్షణలో వరుణ్ తేజ్ రెండు నెలలపాటు బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకొన్న విషయం తెలిసిందే. బరువు తగ్గడంతో పాటు, క్యారెక్టర్ కు తగ్గట్టుగాపర్ ఫెక్ట్ బాక్సర్ గా వరుణ్ తేజ్ ట్రైనింగ్ పొందుతారు. జనవరి నుండి నిరవధికంగా జరిగే షూటింగ్ లో వరుణ్ పాల్గొంటారు. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ లో రొమాన్స్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ ఉంటాయని దర్శకుడు కిరణ్ తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























