రామోజీ ఫిల్మ్ సిటీలో కళ్యాణ్ రామ్ సందడి

#EnthaManchivaadavuraa, Entha Manchivaadavuraa Movie Shooting Updates, Entha Manchivaadavuraa Movie Updates, Entha Manchivaadavuraa Shoot Happening in Ramoji Film City, Entha Manchivaadavuraa Telugu Movie Latest News, Entha Manchivaadavuraa Telugu Movie Shooting Latest News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘ఎంత మంచివాడవురా’ పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘శతమానంభవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఇటీవల రాజమండ్రి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో కళ్యాణ్ రామ్, మెహరీన్, రాజీవ్ కనకాల, పవిత్రా లోకేష్‌పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం. కాగా… ఈ నెల 22 వరకు ఈ షెడ్యూల్ కొన‌సాగుతుంద‌ని తెలిసింది.

గోపిసుందర్ సంగీత‌సార‌థ్యంలో రూపొందుతున్న ‘ఎంత మంచివాడవురా’… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.