ఎ. కోదండరామిరెడ్డి డ‌బుల్ ధ‌మాకా ‘రాక్షసుడు’, ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’కు 33 ఏళ్ళు

Rakshasudu And Oka Radha Iddaru Krishnulu Movies Completed 33 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rakshasudu Movie Completes 33 Years,Oka Radha Iddaru Krishnulu Telugu Movie Completes 33 Years,33 Years Completes For Oka Radha Iddaru Krishnulu Movie,33 Years Completes For Rakshasudu Telugu Movie

1986 అక్టోబర్ 2… దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎ.కోదండరామిరెడ్డి కెరీర్‌లో ప్ర‌త్యేక‌మైన‌ రోజు. ఎందుకంటే… ఇదే రోజున త‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజై మ్యూజిక‌ల్ హిట్స్‌గా నిలిచాయి. వాటిలో ఒక‌టి మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా నటించిన ‘రాక్షసుడు’ కాగా… మ‌రొక‌టి యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు… ఒకే రోజున విడుదలైన ఈ రెండు సినిమాలకు సంబంధించి ప‌లు సారూప్యతలు కూడా ఉన్నాయి. అవేమిటంటే… ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌కి యండమూరి వీరేంద్రనాథ్ కథను అందించ‌గా… వేటూరి సుందరరామమూర్తి గీత రచన, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వ‌ర‌క‌ల్ప‌న చేశారు. ఈ రెండు సినిమాల్లో రాజేంద్రప్రసాద్, రావుగోపాలరావు, అన్నపూర్ణ కామ‌న్ యాక్ట‌ర్స్ కాగా… లోక్ సింగ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడం విశేషం. సంగీతం పరంగా విశేషంగా అలరించిన ఈ రెండు చిత్రాలు కూడా ఇటు చిరంజీవికి, అటు కమల్ హాసన్‌కి కెరీర్ పరంగా మరపురాని విజయాలను అందించాయి. కాగా… నేటితో ఈ చిత్ర ద్వ‌యాలు 33 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.