ఇన్ని రోజులు తన కామెడీ తో.. మరోవైపు హీరోగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. తనే దర్శక నిర్మాతగా మరి ‘భాగ్యనగరవీధుల్లో’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా తాజా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ ను పంచుకున్నారు. అంతే కాదు నా కామెడీని ఆదరించిన ప్రేక్షకులని మరింతగా నవ్వించడానికి నేను చేసిన ప్రయత్నమే ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్.. ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ తో మీ ముందుకు వస్తున్నా.. మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ ట్వీట్ లో కోరాడు. ఇక ఫస్ట్ లుక్ ను చూస్తుంటే శ్రీనివాసరెడ్డితో పాటు ఈ సినిమాలో షకలక శంకర్, సత్య కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పోస్టర్లో ఈ ముగ్గురూ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Naa comedy ni aadharinchina prakshakulani marintha ga navvinchadaaniki nenu chesina prayathname
e out and out comedy entertainer.
Oka manchi comedy entertainer tho mee mundhuku vasthunna.
Mee blessings kaavali🙏🏼😍
No Action
No Sentiment
Only Comedy ☺️☺️☺️ @vennelakishore pic.twitter.com/VqRL9Nzx6W— Srinivasareddy (@Actorysr) September 28, 2019
కాగా ఈ సినిమాను శ్రీనివాస్ రెడ్డి తోపాటు సత్యం రాజేష్, సప్తగిరి, ధనరాజ్, వేణు, ప్రవీణ్ మరియు తాగుబోతు రమేష్ సంయుక్తంగా పెట్టిన ఫ్లైయింగ్ కలర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పరం సూర్యంషు కథను అందిస్తున్నాడు. సాకేత్ కొమండూరి సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























