రజినీకి, కమల్ కి అదే నా సలహా – నన్ను నా తమ్ముణ్ణి డబ్బే ఓడించింది..!

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి ‘స్వయంకృషి’ తో అగ్ర హీరోగా ఎదగడం.. ఇవన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయాలే. ఇక సినీ ఇండస్ట్రీలో చిరంజీవి సాధించిన అవార్డులు, బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం ఆయన డైలాగ్స్ చెప్పే విధానం.. అయన డ్యాన్స్ చేసే విధానం.. ఆయన మేనరిజమ్స్ ఇవన్నీ అభిమానులను పిచ్చెక్కించేవి. అందుకే అంతమంది ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయారు. ఇదంతా చిరు సినీ జీవితం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చిరు రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే అదొక ట్రాజడీ అని చెప్పొచ్చు. నిజానికి చిరుకు ఉన్న ఫ్యాన్ బేస్ ను చూసి రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతాడనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయింది. పార్టీ పెట్టడం.. పార్టీని మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇవన్నీ జరిగిపోయాయి. కానీ ఈ రాజకీయాల వల్ల చిరు మాత్రం చాలా నేర్చుకున్నారని మాత్రం చెప్పొచ్చు.

దీనికి ఇటీవల చిరు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. సైరా ప్రమోషన్ లో భాగంగా ఆయన చెన్నైలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రాజకీయాలపై కూడా స్పందించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినీ హీరో ఉన్నంత కాలం తాను సుప్రీం హీరోగా నిలిచానని..రాజకీయాల్లో మాత్రం గెలవలేకపోయానని చెప్పుకొచ్చారు. రాజకీయాలు అంటే టీ తాగినంత సులభం కాదన్నారు. ముఖ్యంగా సౌమ్యంగా ఉండే వారు రాజకీయాలకు అసలు సరిపోరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎదురుదెబ్బలు తినటానికి కూడా సిద్ధపడితేనే రాజకీయాల్లోకి రావాలన్నారు. ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితులు మారొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాజకీయాలను డబ్బులు శాసిస్తున్నాయని పేర్కొన్నారు. అంతే కాదు తాను, తన తమ్ముడు ఓడిపోవడానికి డబ్బే కారణమని.. ఈ సందర్భంగా తన ఫ్రెండ్స్ రజినీ, కమల్ కు ఒక సలహా ఇస్తున్నాను.. వారు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటేనే బెటర్ అని సలహా కూడా ఇచ్చారు. ఇక చిరు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాయి. చూద్దాం ఈ టాపిక్ ఎన్ని డిస్కషన్స్ కు దారి తీస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.