రకుల్ ప్రీత్ సింగ్… ఈ తరం కుర్రకారు కలలరాణి. అలాంటి రకుల్ కి 2013లో విడుదలైన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తొలి విజయాన్ని అందిస్తే… 2014లో విడుదలైన ‘లౌక్యం’ స్టార్‌డమ్‌ని కట్టబెట్టింది. అంతేకాదు… బ్లాక్‌బస్టర్ మూవీగా నిలచిన ‘లౌక్యం’ తరువాతే రకుల్ టాలీవుడ్ టాప్ హీరోలతో ఆడిపాడింది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘లౌక్యం’లో గోపీచంద్ కథానాయకుడిగా నటించగా శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. `లక్ష్యం` వంటి బ్లాక్‌బస్టర్ తరువాత గోపీ, శ్రీవాస్ కాంబినేషన్‌లో వచ్చిన `లౌక్యం` కూడా అదే బాట పట్టడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంపత్ రాజ్, చంద్రమోహన్, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, కృష్ణభగవాన్, పృథ్వీరాజ్, హంసా నందిని, ప్రగతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన `లౌక్యం`కి అనూప్ రూబెన్స్ సంగీతమందించగా… భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. తమిళంలో ‘సక్క పోడు పోడు రాజా’ పేరుతోనూ, కన్నడంలో ‘రామ్‌లీలా’గానూ, బెంగాలీలో ‘బేష్ కొరెచి ప్రేమ్ కొరెచి’ టైటిల్‌తోనూ ఈ సినిమాను రీమేక్ చేసారు. 2014 సెప్టెంబర్ 26న విడుదలై ఘన విజయం సాధించిన ‘లౌక్యం’… నేటితో 5 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























