నార్త్ అమెరికా 2019 బాలీవుడ్ టాప్ 10 మూవీస్ లో సాహో మూవీ 4వ స్థానం లో నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. రణవీర్ సింగ్ గల్లీ బాయ్ మొదటి , విక్కీ కౌశల్ ఉరి సర్జికల్ స్ట్రైక్ రెండవ , అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ మూడవ , ప్రభాస్ సాహో నాల్గవ , సల్మాన్ ఖాన్ భారత్ ఐదవ , షాహిద్ కపూర్ కబీర్ సింగ్ ఆరవ , వరుణ్ ధావన్ కళంక్ఏడవ , రజనీకాంత్ పేట్ట ఎనిమిదవ , హృతిక్ రోషన్ సూపర్ 30 తొమ్మిదవ , వెంకటేష్ F2 (హిందీ డబ్బింగ్ )పదవ స్థానాలలో నిలిచాయి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సాహో కు మిశ్రమ స్పందన లభించినా కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేయడం విశేషం. ఈ మూవీ లోని భారీ యాక్షన్ సీన్స్ కు ప్రేక్షక, అభిమానుల విశేష స్పందన లభించింది. బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో చేరి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, హృతిక్ రోషన్ నటించిన మూవీస్ ను త్రోసిరాజని సౌత్ హీరో ప్రభాస్ నటించిన బాలీవుడ్ మూవీ సాహో టాప్ 10 మూవీస్ లో 4వ స్థానం లో నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























