గద్దల కొండ గణేష్‌గా వ‌రుణ్ తేజ్‌

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Mega Prince Varun Tej As Gaddala Konda Ganesh, Varun Tej Character as Gaddala Konda Ganesh, Varun Tej As Gaddala Konda Ganesh In Valmiki, Varun Tej New Poster As Gani Alias Gaddhalakonda Ganesh, Varun Tej Valmiki Movie Latest News

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ న‌టించిన‌ మాఫియా కామెడీ ఎంటర్‌టైనర్ ‘వాల్మీకి’. వ‌రుణ్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టించిన‌ ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించాడు. తమిళ సినిమా ‘జిగర్తండా’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో… కోలీవుడ్ హీరో అధ‌ర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా… ఈ సినిమాలో వ‌రుణ్ పాత్ర‌కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా రివీల్ చేశాడు. గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ అలియాస్ గ‌ని పేరుతో `వాల్మీకి`లో వ‌రుణ్ సంద‌డి చేస్తున్నాడట‌. కాగా… ఇప్ప‌టికే టీజ‌ర్‌తో ఇంప్రెస్ చేసిన వ‌రుణ్ పాత్ర‌కు సంబంధించిన మ‌రిన్ని విశేషాల‌ను… ఈ రోజు (సెప్టెంబ‌ర్ 9) సాయంత్రం 4 గంట‌ల‌కు రిలీజ్ కానున్న ట్రైల‌ర్‌లో పొందుప‌రిచార‌ట‌. మ‌రి…. ప్ర‌చార‌చిత్రాల‌తో, పాట‌ల‌తో ఇంప్రెస్ చేస్తున్న `వాల్మీకి` థియేట‌ర్ల‌లో ఏ మేర‌కు మెస్మ‌రైజ్ చేస్తాడో తెలియాలంటే ఈ నెల 20వ‌ర‌కు వేచిచూడాల్సిందే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

14 రీల్స్ ప్ల‌స్‌ పతాకంపై రూపొందిన `వాల్మీకి`కి మిక్కీ జే మేయ‌ర్ బాణీలు అందించాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.