శ్రీదేవి… అందానికి, అభినయానికి ఐకాన్‌లా నిలచిన ఓ తరం అగ్ర కథానాయిక. ఆల్ ఇండియా సూపర్‌స్టార్ అనిపించుకున్న శ్రీదేవికి సంబంధించి ఆమె పోషించిన పాత్రలే కాదు నర్తించిన గీతాలు కూడా నిత్యనూతనమే. అంతేకాదు… ఈ తరం కథానాయికలకు మార్గదర్శకురాలిగా నిలచిన శ్రీదేవిని దృష్టిలో పెట్టుకుని… ఇప్పటికే కొంతమంది టాలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె పాటలను రీమిక్స్ చేయగా… తాజాగా మరికొంతమంది ఇదే బాటలో నడుస్తున్నారు. ముఖ్యంగా… ఈ ఏడాదినైతే శ్రీదేవి రీమిక్స్ నామ సంవత్సరం అనొచ్చేమో. ఎందుకంటే… శ్రీదేవి నర్తించిన మూడు పాటలు రీమిక్స్ రూపంలో సందడి చేస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఈ సంవత్సరం ఆరంభంలో విడుదలైన `యన్టీఆర్ కథానాయకుడు`లో `ఆకుచాటు పిందె తడిసె` (వేటగాడు) పాటని రీమిక్స్ చేయగా… శ్రీదేవి పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ తన చిందులతో కనువిందు చేసింది. ఇక ఈ నెల 20న రానున్న `వాల్మీకి`లోనూ శ్రీదేవి పాపులర్ సాంగ్ రీమిక్స్‌కి స్థానముందట. `ఎల్లువొచ్చి గోదారమ్మ` (దేవత)కి రీమిక్స్ గా రానున్న ఈ పాటలో పూజా హెగ్డే సందడి చేయనుంది. ఇందులో పూజ పాత్ర పేరు శ్రీదేవి కావడం ఆసక్తిదాయకం. ఇక `పాగల్ పంతి` పేరుతో రూపొందుతున్న హిందీ చిత్రంలో… `చాల్ బాజ్`(హిందీ) కోసం శ్రీదేవి నర్తించిన `తేరా బీమార్ మేరా దిల్` పాటని రీమిక్స్ చేస్తున్నారు. ఇందులో గోవా సుందరి ఇలియానా కాలు కదపనుంది.
మరి… ఈ రీమిక్స్ గీతాలు ఏ మేరకు రంజింపజేస్తాయో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























