తొలి సినిమా పెళ్లి చూపులు సినిమాతో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కు మంచి గుర్తింపు వచ్చింది. విజయ్ దేవరకొండ నిర్మాతగా.. ‘ది కింగ్ ఆఫ్ హిల్స్’ ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ హీరో గా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నిన్ననే ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఈరోజు తాజాగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఒక స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే లుక్ లో సెట్ చేసిన పోస్టర్ సరికొత్తగా ఉంది. ఇక మై బెస్ట్ ఫ్రెండ్స్ సీక్రెట్స్ అనే ట్యాగ్ తో తరుణ్ భాస్కర్ అలాగే మరోప్ ఇద్దరు కమెడియన్స్ మొబైల్స్ తో ఆశ్చర్యంగా ఇచ్చిన స్టిల్స్ చూస్తుంటే సినిమాలో కామెడీ డోస్ గట్టిగానే ఉంటుందని ఊహించవచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ షమ్మిర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇంకా అభినవ్, నవీన్ జార్జి థామస్ కూడా నటిస్తున్నాడు. అనసూయ మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. మరో ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ప్రస్తుతం ‘హీరో’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆనంద్ అన్నమలై దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తున్నారు. దీంతో పాటు ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























