తెలుగునాట పలు రైతు కథా చిత్రాలు వచ్చాయి. అయితే… ఆ తరహా సినిమాలకు బీజం వేసిన చిత్రంగా `రైతుబిడ్డ`(1939)కి ప్రత్యేక స్థానం ఉంది. “వచ్చేది రైతు రాజ్యం, ఏలేది రైతు సంఘం” అన్న నినాదంతో ఈ సినిమా తెరకెక్కింది. భారతదేశాన్ని బ్రిటీష్ ప్రభుత్వం ఏలుతున్న కాలంలో సామాజిక సంస్కరణ వాద చిత్రంగా `రైతుబిడ్డ` రూపొందింది. జమీందారీ వ్యవస్థపై పోరు సాగుతున్న ఆ కాలంలో… ఈ చిత్రాన్ని సారథి ఫిలిమ్స్ లిమిటెడ్ పతాకంపై చల్లపల్లి మహారాజ అనే జమీందార్ నిర్మించడం విశేషం. అలాగే… ‘మాలపిల్ల’ వంటి సామాజిక చిత్రాన్ని తెరకెక్కించిన గూడవల్లి రామబ్రహ్మం… ‘రైతుబిడ్డ’కు దర్శకత్వం వహించడం మరో విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
`రైతుబిడ్డ`లోప్రముఖ రంగస్థల నటుడు ‘బళ్ళారి’ రాఘవ ప్రధాన పాత్ర పోషించగా… గిడుగు వెంకట సీతాపతి, `జానపద కవి సార్వభౌమ` కొసరాజు రాఘవయ్య చౌదరి, భీమవరపు నరసింహారావు, టంగుటూరి సూర్యకుమారి, వేదాంతం రాఘవయ్య, పి.సూరిబాబు, నెల్లూరి నాగరాజరావు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోనూ… ప్రముఖ నటీమణి ఎస్.వరలక్ష్మి బాలనటిగాను దర్శనమిచ్చారు.
సందర్భోచితంగా సాగే ఈ చిత్రంలోని గీతాలకు భీమవరపు నరసింహారావు స్వరకల్పన చేసారు. ‘దేవదాసు’, ‘అనార్కలి’, ‘చిరంజీవులు’, ‘సువర్ణ సుందరి’, ‘బాలనాగమ్మ’, `ఆడ బ్రతుకు`తో పాటు పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన వేదాంతం రాఘవయ్య… ‘రైతుబిడ్డ’లో చేసిన దశావతారం నృత్యం ఆ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. అప్పట్లో ఈ నాట్యం చూడడానికి థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టేవారట.
బ్రిటీష్ వారి ఏలికలో కొన్ని చోట్ల నిషేధానికి గురైన ‘రైతుబిడ్డ’… భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అంటే 1948లో అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శితమవడం విశేషం. 1939 ఆగస్టు 27న విడుదలై సంచలన విజయం సాధించిన ‘రైతుబిడ్డ’… నేటితో 80 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























