నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం `గ్యాంగ్ లీడర్`, `వి` చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె.కుమార్ రూపొందిస్తున్న`గ్యాంగ్ లీడర్` సెప్టెంబర్ 13న విడుదల కానుండగా… ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కిస్తున్న `వి` క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `వి` తాజా షెడ్యూల్లో నాని కూడా జాయిన్ అయ్యాడని… ప్రస్తుతం నానిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. అంతేకాదు… క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సీరియల్ కిల్లర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడని తెలుస్తోంది. వరుస హత్యలు చేసి క్లూస్ వదిలేసే ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో నాని కనిపించనున్నాడని… అలాగే సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేస్తున్నాడని టాక్. సుధీర్ బాబు, అదితి రావ్ హైదరీ, నివేదా థామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న `వి` చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నాడు.
[subscribe]
[youtube_video videoid=KadISeTwW1U]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: