కురుక్షేత్రం తెలుగు మూవీ రివ్యూ

మహాభారతంలోని కురుక్షేత్ర యుద్దం నేపథ్యంలో కన్నడలో కురుక్షేత్ర అనే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈసినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్క కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. మరి భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా.. ఆ అంచనాలను అందుకుందో? లేదో? చూద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : అర్జున్, ద‌ర్శ‌న్, నిఖిల్‌ గౌడ్‌, రవిచంద్రన్, సోనూసూద్, స్నేహ
దర్శకత్వం : నాగన్న
నిర్మాత‌లు : మునిరత్నం(ఎం ఎల్ ఏ)
సంగీతం : హ‌రికృష్ణ‌
స్క్రీన్ ప్లే : నాగన్న

కథ

ఈసినిమాలో ధర్మరాజు పట్టాభిషేకాన్ని దుర్యోధనుడు తిరస్కరిస్తాడు. ఇక్కడ్నుంచి కథ స్టార్ట్ అవుతుంది. క‌ర్ణుడు(అర్జున్)ని దుర్యోధ‌నుడు (ద‌ర్శ‌న్) రాజుగా ప్రకటించడం.. అక్కడ కర్ణుడు, దుర్యోధనుడు స్నేహితులుగా మారడం, శకుని పన్నిన పన్నాగంలో పాండవులు చిక్కుకుని అడవుల పాలు అవ్వడం? క‌ర్ణుడు మరియు దుర్యోధ‌నుడు మధ్య స్నేహం ఎంత గొప్పది ? చివరికీ కౌరవుల మీద పాండవులు ఎలా గెలిచారు ? ఆ గెలుపుకు శ్రీ కృష్ణుడు ఎలా కారణమయ్యాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ

మహాభారతం కథ అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుండి ఎన్నో పుస్తకాల్లో, పాత సినిమాల్లో చూసాం. కౌరవులకి-పాండవులకి జరిగిన యుద్ధం కురక్షేత్రం. మరోసారి ఆ యుద్దాన్నే కీ పాయింట్ గా తీసుకొని తెరకెక్కించారు నాగన్న. ఇక ఈ సినిమాకు విషయానికి వస్తే.. అన్ని ముఖ్య పాత్రలకు అగ్ర కన్నడ నటీనటులు నటించడం.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ క‌ర్ణుడుగా ద‌ర్శ‌న్ దుర్యోధ‌నుడిగా, సోనూసూద్ అర్జునుడిగా, అభిమ‌న్యుడిగా నిఖిల్‌ గౌడ్‌, కృష్ణుడిగా ర‌విచంద్ర‌న్ ద్రౌప‌దిగా స్నేహ.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో చాల బాగా నటించారు. ఆయా పాత్రలకి వారు జీవం పోసారనే చెప్పాలి. ఇక దుర్యోదనుడు పాత్రలో దర్శన్ యాక్టింగ్ సినిమాకి హైలెట్.

ఇంకా 3డి ఎఫెక్ట్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. మయసభలో ద‌ర్శ‌న్ మీద వచ్చే సాంగ్ కూడా చాల బాగుంది. ద్రౌపతిగా స్నేహ, అర్జునిడిగా సోనూసూద్ కర్ణుడిగా అర్జున్ చాలా బాగా నటించారు. తెలిసిన కథే అయినా సరే ఒక దృశ్యకావ్యం చూస్తున్నట్లుగా తీసాడు డైరెక్టర్ నాగన్న. మేకింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్, ఆర్ ఆర్, లొకేషన్స్, ఫోటోగ్రఫీ సినిమాకి హైలెట్. అయితే చాలామంది కన్నడ ఆర్టిస్టులే ఉండటం వల్ల కూడా తెలుగు ప్రేక్షకులకి నేటివిటీ కొరవడిందని చెప్పొచ్చు.

సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని భారీ విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ పర్వాలేదు. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

ఓవర్ ఆల్ గా చెప్పాలంటే సోషియో ఫాంటసీ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది.

[wp-review id=”26664″]  

[subscribe]

[youtube_video videoid=EzFc1SRTrYQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.