ఇప్పటికే పాటలు, పోస్టర్లతో సాహో చిత్ర యూనిట్ రోజుకో సర్ ప్రయిజ్ ఇస్తుంది ఫ్యాన్స్ కి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎక్కడిక్కడ షెడ్యూల్స్ ను ఫిక్స్ చేసుకోనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నేషనల్ వైడ్ గా టూర్ వేసే ప్లాన్ లో ఉన్నారు. అంతే కాదు ‘సాహో ది గేమ్’ పేరుతో ఓ వీడియో గేమ్ ని కూడా విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్ర చేస్తున్న నీల్ నితిన్ ముకేశ్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేశారు. ఆ పోస్టర్లో నీల్ నితిన్ గ్లాసెస్ పెట్టుకొని,బీయర్డ్ ఫేసుతో సూపర్ సైలిష్ గా ఉన్నాడు. నితిన్ లుక్ చూస్తుంటే ప్రభాస్ లాంటి హీరోకి విలన్ అంటే ఆ మాత్రం ఉండాలి అన్నట్టు వుంది నీల్ నితిన్ లుక్ చూస్తుంటే.
ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఇంకా జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈనెల 30న భారీగా విడుదల కానుంది.
[youtube_video videoid=8KwZW-wH0PI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























