`అ!` ద‌ర్శ‌కుడితో అఖిల్ చిత్రం?

2019 Latest Telugu Movie News, Awe movie director Prasanth to direct Akhil Akkineni,Prasanth Varma to direct Akhil Akkineni , Akhil Akkineni Fascination with Out of Form Directors Continue, Akhil,Prasanth Varma next with Akhil Akkineni, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

ప్ర‌యోగాత్మ‌క చిత్రం `అ!`తో టాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించాడు యువ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వ‌ర్మ‌. ఇటీవ‌ల `క‌ల్కి`తో మ‌రోసారి ఇంప్రెస్ చేసిన ప్ర‌శాంత్‌… త్వ‌ర‌లో త‌న తొలి చిత్ర క‌థానాయిక కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో మ‌రో ఎక్స్‌పెరిమెంటల్ మూవీ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. అంతేకాదు… అక్కినేని వారి యువ క‌థానాయ‌కుడు అఖిల్‌తోనూ ఓ ప్రేమ‌క‌థా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట ప్ర‌శాంత్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్ప‌టికే ప్ర‌శాంత్‌, అఖిల్ మ‌ధ్య ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని… స్టోరీ లైన్ న‌చ్చ‌డంతో అఖిల్ కూడా ఈ సినిమా చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ని స‌మాచారం. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తాడ‌ని టాక్‌. ప్ర‌స్తుతం అఖిల్‌… `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్త‌య్యాకే ప్ర‌శాంత్ కాంబినేష‌న్ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముంద‌ని వినిపిస్తోంది. రానున్న రోజుల్లో అఖిల్ – ప్ర‌శాంత్ కాంబినేష‌న్ మూవీపై మ‌రింత క్లారిటీ రావ‌చ్చు.

[subscribe]

[youtube_video videoid=B7cm2UcOYV0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.