ప్రస్తుతం తెలుగునాట నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. అలాంటి డీఎస్పీకి, ఆయన అభిమానులకు ఆగస్టు 2 ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే… ఆ రోజు దేవిశ్రీ పుట్టిన రోజు. ఇక ఈ ఏడాది ఆగస్టు 2తో ఈ యువ సంగీత సంచలనం 40 వసంతాలను పూర్తిచేసుకుంటున్నాడు. అంతేకాదు… ఈ పుట్టినరోజు డీఎస్పీకి వెరీ వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే… అదే రోజున దేవిశ్రీ తమ్ముడు, గాయకుడు సాగర్… రచయితగా తొలి అడుగులు వేసిన `రాక్షసుడు` సినిమా రిలీజ్ కాబోతోంది. తమిళ చిత్రం `రాట్చసన్`కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా… ఆగస్టు 2న అంటే దేవిశ్రీ పుట్టినరోజున రాబోతోంది. మరి… టీజర్, ట్రైలర్‌లలో తన సంభాషణలతో ఆకట్టుకుంటున్న సాగర్… ఫుల్ లెన్త్ సినిమాలోనూ తనదైన ముద్ర వేసి… అన్నయ్యకి గుర్తుండిపోయే పుట్టినరోజు కానుక అందిస్తాడేమో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=shpVFz2yFSo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























