సాహో నుండి వచ్చేస్తున్న ‘ఏ చోట నువ్వున్నా’

Ye Chota Nuvvunna Song From Saaho Out Tomorrow, #YeChotaNuvvunna, 2019 Latest Telugu Movie News, Prabhas To Comeout With Another Gift To Fans, saaho, Saaho Movie, Saaho movie songs, Saaho Second Song To Be Out Soon, Saaho Second Song To be Released Tomorrow, saaho telugu movie, Saaho Telugu movie songs, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Ye Chota Nuvvunna Song Teaser Releasing Tomorrow, Ye Chota Nuvvunna Songs
Ye Chota Nuvvunna Song From Saaho Out Tomorrow

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో ‘సాహో’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా నెలరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అప్పుడే మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి టీజర్ ను.. సయ్యా సైకో అనే పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో పాటను విడుదల చేశారు. ఎన్ని సోనా అనే పాటను రేపు విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు గురు రంధవా మ్యూజిక్ అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* తెలుగులో ‘ఏ చోట నువ్వున్నా’ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ పాటను కృష్ణ కాంత్ రచించగా.. హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్ ఈపాటను ఆలపించారు.

* హిందీలో ‘ఎన్ని సోనా’ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ పాటను గురు రంధవా రచించారు. ఇక ఈ పాటను రంధవా, తులసి కుమార్ ఆలపించారు.

* తమిళంలో ‘మళయుమ్ తీయుమ్’ పేరుతో రిలీజ్ అవుతున్న ఈపాటను కర్కే రచించగా.. హరి చరణ్ శేషాద్రి, శక్తి శ్రీ గోపాలన్ ఆలపించారు.

* మలయాళంలో ‘ఏకాంత తారమే’ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ పాటను వినాయక్ శశికుమార్ రచించగా.. హరి చరణ్ శేషాద్రి, శక్తి శ్రీ గోపాలన్ ఆలపించారు.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=rDoFiOjoC2Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.