మహాభారతంలోని కురుక్షేత్ర యుద్దం గురించి అందరికీ తెలిసిందే. ఆ హిస్టారికల్ వార్ నేపథ్యంలో కన్నడలో కురుక్షేత్ర అనే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి కూడా విదితమే. పోస్ట్ ప్రోడక్షన్ పనులు సైతం ముగించుకున్న ఈసినిమా ఆగష్ట్ 9వ తేదీన రిలీజ్ కానుంది. ఒక్క కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా KCN మూవీస్ బ్యానర్ పై నాగన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది స్టార్ హీరోలు నటిస్తున్నారు. రవిచంద్రన్ కృష్ణుడు, దర్శన్ దుర్యోధనుడు, అర్జున్ కర్ణుడు, సోనూసూద్ అర్జునుడు గా స్నేహ ద్రౌపది పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో 200రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది.
[subscribe]
[youtube_video videoid=hKsEh1NPY48]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























