‘ఓ బేబీ’ హిందీ రీమేక్‌లో అలియా భ‌ట్‌?

2019 Latest Telugu Movie News, Alia Bhatt to Remake Oh Baby Movie in Hindi, Alia Bhatt in Oh Baby Movie Bollywood Remake, Alia Bhatt in talks for Oh Baby Remake, Alia Bhatt Ropped a Chance To act In Remake of Oh Baby, Oh Baby Movie Remake Updates, Oh Baby Remake Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Alia Bhatt to Remake Oh Baby Movie in Hindi

కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ` ఆధారంగా తెర‌కెక్కిన తెలుగు చిత్రం `ఓ బేబీ`. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో నందినీ రెడ్డి రూపొందించిన ఈ సోషియో ఫాంట‌సీ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్… ఇటీవ‌ల విడుద‌లై విజ‌య‌ప‌థంలో ప‌య‌నిస్తోంది. కాగా, ఈ సినిమాని హిందీలోనూ రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. తెలుగు వెర్ష‌న్‌ని నిర్మించిన డి.సురేష్ బాబే… హిందీ వెర్ష‌న్‌ని కూడా నిర్మించ‌నున్నార‌ని టాక్‌. కాగా… ఇక్క‌డ‌ సామ్ పోషించిన పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాసివ్ మ‌ల్టీస్టార‌ర్‌ ‘ఆర్ ఆర్ ఆర్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న అలియా… ప్ర‌స్తుతం పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. `స‌డ‌క్ 2`, `బ్ర‌హ్మాస్త్ర‌`, `త‌ఖ్త్‌` పేర్ల‌తో రూపొందుతున్న ఆ యా చిత్రాలు వ‌చ్చే ఏడాది తెర‌పైకి రానున్నాయి. ఈ నేప‌థ్యంలో… `ఓ బేబీ` రీమేక్‌లో అలియా పేరు వినిపించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

త్వ‌ర‌లోనే `ఓ బేబీ` హిందీ వెర్ష‌న్‌కు సంబంధించి మ‌రింత క్లారిటీ వచ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

[youtube_video videoid=xGA69pFMWTo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.