లేడి ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా మారింది తాప్సీ. ఇప్పటికే విభిన్న కథా చిత్రాలతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తున్న ఈ భామ తాజాగా గేమ్ ఓవర్ అనే విభిన్న కథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఈసినిమా కూడా హిట్ అవ్వడంతో అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న రాజుగారి గది3 సినిమా లో తాప్సీ నటించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికరమైన న్యూస్ ఒకటి వినిపిస్తోంది. ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మిథాలి రాజ్ పాత్రలో తాప్సీ నటించనున్నట్టు తెలుస్తోంది. హిందీ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమాకు డైరెక్టర్..సాంకేతిక నిపుణుల గురించి మరింత సమాచారం తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=TAM9YZkL3XE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























