బాలీవుడ్‌లో నెల‌కో తెలుగు ద‌ర్శ‌కుడి ఎంట్రీ

2019 Latest Telugu Movie News, Director Sandeep Reddy Vanga Latest News, telugu directors shocking offers to work with bollywood, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Tollywood Directors Hungama in Bollywood, Tollywood directors who worked in Bollywood, tollywood directors working in bollywood
Tollywood Directors Hungama in Bollywood

హిందీనాట‌ ప‌లువురు తెలుగు ద‌ర్శ‌కులు త‌మదైన ముద్ర‌వేశారు. అయితే, వ‌రుస నెల‌ల్లో టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌డం అరుదైన విష‌య‌మ‌నే చెప్పాలి. ఈ ఏడాది అలాంటి అరుదైన సంఘ‌ట‌నే హిందీనాట చోటుచేసుకుంటోంది. జూన్‌, జులై, ఆగ‌స్టు… ఇలా ఈ మూడు నెల‌ల్లో మ‌న ద‌ర్శ‌కులు వ‌రుస‌పెట్టి అక్క‌డ రంగ‌ప్ర‌వేశం చేస్తున్నారు. ఆ ద‌ర్శ‌కులు మ‌రెవ‌రో కాదు… సందీప్ రెడ్డి వంగా, ప్ర‌కాష్ కోవెల‌మూడి, సుజీత్‌. ఇప్ప‌టికే జూన్ 21న విడుద‌లైన `అర్జున్ రెడ్డి` రీమేక్ `క‌బీర్ సింగ్‌`(షాహిద్ క‌పూర్‌, కియారా అద్వాని హీరోహీరోయిన్లు) తో సందీప్ బాలీవుడ్‌లో స్ట్రాంగ్ ఇంప్రెష‌న్ వేస్తే… జులై 26న‌ `జ‌డ్జ్‌మెంట‌ల్ హై క్యా?` (రాజ్‌కుమార్ రావ్‌, కంగ‌నా ర‌నౌత్‌)తో అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాడు ద‌ర్శ‌కేంద్రుడి త‌న‌యుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి. ఇక ఆగ‌స్టు 15న‌ బ‌హుభాషా చిత్రం `సాహో`(ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్‌)తో సుజీత్‌తో హిందీనాట తొలి అడుగులు వేస్తున్నాడు. `సాహో` పేరుకి బ‌హుభాషా చిత్ర‌మైనా… ఇందులో బాలీవుడ్ న‌టుల‌కే పెద్ద‌పీట వేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి…`క‌బీర్ సింగ్‌`తో సందీప్ తెలుగువాడి స‌త్తాని మ‌రోసారి చాటి ఘ‌న‌విజ‌యం అందుకున్న నేప‌థ్యంలో… ప్ర‌కాష్, సుజీత్ కూడా అదే బాట‌లో వెళ్ళి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందుకుంటారేమో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=4ntpdSTgfJw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.