‘ఐకాన్’లో నాలుగు డిఫ‌రెంట్ లుక్స్‌లో అల్లు అర్జున్‌?

2019 Latest Telugu Movie News, Allu Arjun To Be Seen In New Looks, Allu Arjun new look, Allu Arjun Will Be Seen In New Look, allu arjun new look 2019, Allu Arjun latest movie updates, Allu Arjun upcoming movies, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Allu Arjun To Be Seen In New Looks
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం తరువాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… ఇప్పుడు వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ఒక‌టి ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాగా… రెండోది వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఐకాన్’మూవీ. ఇక మూడోది సుకుమార్ కాంబినేష‌న్ మూవీ. కాగా… డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్క‌నున్న `ఐకాన్‌`లో బన్నీ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం… ఆ ద్విపాత్ర‌ల‌కు అనుగుణంగా నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో బ‌న్నీ దర్శనమివ్వనున్నాడని తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే… ‘ఐకాన్’లో బన్నీ రెగ్యులర్ లుక్‌తో పాటు, నాలుగు పదుల వయసుండే మిడిల్ ఏజ్డ్ గెట‌ప్‌ కూడా ఉంటుంద‌ని టాక్‌. అలాగే మరో రెండు ఇంట్రెస్టింగ్ గెటప్స్‌తో కూడా ఆడియ‌న్స్‌ని అలరించనున్నాడట స్టైలిష్ స్టార్‌. మ‌రి… ఈ వార్త‌ల్లో నిజ‌మెంతుందో తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా… ‘దిల్’ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ‘ఐకాన్’ మూవీ ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని ప్ర‌చారం సాగుతోంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid= jVVAaDegl7g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.