పూజా హెగ్డే… ప్రస్తుతం తెలుగునాట తారాపథంలో దూసుకుపోతున్న కథానాయిక. తాజాగా ‘మహర్షి’తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ స్టన్నింగ్ బ్యూటీ.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘జాన్’ (ప్రచారంలో ఉన్న పేరు) చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వాల్మీకి’లోనూ పూజనే కథానాయిక. వీటితో పాటు బాలీవుడ్ మూవీ ‘హౌస్‌ఫుల్ 4’లోనూ నటిస్తోందీ భామ. ఇలా తెలుగుతో పాటు హిందీలోనూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పూజ… తాజాగా మరో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… సునీల్ శెట్టి, జాన్ అబ్రహామ్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సంజయ్ గుప్తా రూపొందిస్తున్న చిత్రం ‘ముంబయి సాగా’. ఇందులో ఓ కథానాయికగా నటించే అవకాశం పూజకి దక్కిందని బాలీవుడ్ ఖబర్. త్వరలోనే పూజ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
[youtube_video videoid=6hOGLvGN7yE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























