తమిళంలో అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వీరం సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమాను తెలుగులో కిశోర్ కుమార్ పార్థసాని (డాలి) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘కాటమరాయుడు’ అనే టైటిల్ తో తెరకెక్కించారు. పవన్ కు తమ్ముళ్లుగా ఈ సినిమాలో అజయ్, శివ బాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ నటించారు. అయితే తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను బాలీవుడ్లో కూడా రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే.. ఈ రీమేక్‌లో ‘యూరీ’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్ హీరోగా నటించనున్నాడు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సాజిద్ నదియావాలా ఈ సినిమాను నిర్మించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
మరి తమిళంలో అయితే హిట్ కొట్టింది. తెలుగులో మాత్రం నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో హిందీ లో ఈ సినిమా ఎలా ఉంటుందో.. అందులో సర్జికల్ స్ట్రైక్స్ లాంటి సినిమా తీసిన విక్కీ కౌశల్ కు ఈ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=oKUwVqkdll4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























