మ‌హేష్ కోసం ట్రైన్ నేప‌థ్యంలో సాగే ల‌వ్ ట్రాక్‌?

#SarileruNeekevvaru, Latest Telugu Movies News, Mahesh Babu 26th Film Sarileru Neekevvaru Movie Story, Mahesh Babu Sarileru Neekevvaru Movie Story, Mahesh Babu Starrer Sarileru Neekevvaru Story Inspired, Sarileru Neekevvaru Movie Updates, Sarileru Neekevvaru Telugu Movie Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Mahesh Babu Sarileru Neekevvaru Movie Story

`భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి` వంటి ఘ‌న‌విజ‌యాల త‌రువాత సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న‌ చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌నున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో మహేష్ సరసన `ఛ‌లో` బ్యూటీ ర‌ష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే లేడీ సూప‌ర్ స్టార్ విజ‌యశాంతి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. కాగా, ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన‌ ఈ సినిమా… ఈ నెల 24 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుందని స‌మాచారం. ఇదిలా ఉంటే… ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంత‌కీ ఆ అప్‌డేట్ ఏంటంటే… ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’లో మహేష్ తొలిసారిగా ఆర్మీ ఆఫీస‌ర్ పాత్రలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, క‌థ రీత్యా కాశ్మీర్ నుంచి ఆంధ్రాకు ట్రైన్ జ‌ర్నీ చేసే మ‌హేష్‌… ఈ రైలు ప్ర‌యాణంలోనే క‌థానాయిక రష్మికతో ప్రేమలో పడతాడట‌. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు చాలా స‌ర‌దాగా, ఆహ్లాదంగా ఉంటాయ‌ని స‌మాచారం. అంతేకాదు… క‌నువిందుగా సాగే ఈ దృశ్యాలు సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని టాక్‌.

ఇకపోతే… గత కొంతకాలంగా మహేష్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ మాత్రమే చేస్తూ వస్తున్నాడు. అయితే… ‘దూకుడు’ తర్వాత అటువంటి ఫుల్ లెన్త్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టిస్తున్న చిత్ర‌మిదేన‌ని మ‌హ‌ష్ స్వ‌యంగా వెల్ల‌డించడం, దానికి తగ్గట్టుగానే అనిల్ ఈ సినిమాని రూపొందించనున్నాడనే టాక్ రావడంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా… ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’… 2020 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ‌ప్ర‌సాద్.

[subscribe]

[youtube_video videoid=zCzNEtv7DzE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.