తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. గత కొద్ది కాలంగా ఇండో పాక్ బోర్డర్ లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ యాక్షన్ సీన్‌లో భాగంగా గోపీచంద్ గాయపడటంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. తాజాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశారు. రెండు రోజుల క్రితమే.. హైదరాబాద్ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలనే ప్రధానంగా చిత్రీకరిస్తున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారట చిత్రయూనిట్. ‘బంగారు బుల్లోడు’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా 1993లో బాలయ్య హీరోగా వచ్చిన ‘బంగారు బుల్లోడు’ మ్యూజికల్ గా క్లాసిక్ హిట్ అయింది. మరి గోపీచంద్ కి ఈ టైటిల్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.
ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహ్రీన్ కౌర్ మరియు బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ కు ఈసినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=9jOVc1hBOEE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























