శ్రియా శరన్… నిన్నటి తరం అగ్ర కథానాయిక. అందానికి చిరునామాగా నిలచిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… పలు చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో కూడా కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందింది. కాగా, ఇప్పుడు మరోసారి నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో దర్శనమివ్వనుంది శ్రియ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… సెన్సిబుల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి… యువ కథానాయకుడు నితిన్‌తో ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. దానితో పాటు ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీని కూడా ప్లాన్ చేస్తున్నాడు సదరు టాలెంటెడ్ డైరెక్టర్. ఇందులోనే శ్రియ ప్రధాన పాత్రలో నటించనుందట. అంతేకాదు, పదేళ్ళ అమ్మాయికి తల్లిగా అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలో ఈ టాలెంటెడ్ బ్యూటీ కనిపించనుందని టాక్. దర్శకుడు చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన శ్రియ… వెంటనే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందట. శ్రియ పాత్రతో పాటు కూతురు పాత్ర కూడా సినిమాలో చాలా కీలకమని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
కాగా… గతంలో శ్రియ తల్లి పాత్రలో నటించిన ‘మనం’, ‘గోపాల గోపాల’, `దృశ్యం` (హిందీ), ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలు విజయం సాధించడంతో పాటు ప్రేక్షకుల మన్ననలను పొందాయి. ఈ నేపథ్యంలో మరోసారి తల్లి పాత్రలో కనిపించనున్న శ్రియకు… ఈ ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=OVqpFOdv9Vs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























