స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, హారిక &హాసిని బ్యానర్స్ పై AA19 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లక్కీ హీరోయిన్ పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. థమన్ SS సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నAA19 మూవీ సెకండ్ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమయింది. ఈ రోజు నుండి హీరోయిన్ పూజ హెగ్డే షూటింగ్ లో పాల్గొంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన రెండు సినిమాలు ఘనవిజయం సాధించాయి. ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో AA19 మూవీ మూడవ సినిమా. అల్లు అర్జున్ , పూజ హెగ్డే జంటగా నటించిన DJ మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ గా పేరుపొందిన అల్లు అర్జున్ తో ఈక్వల్ గా ఆ మూవీ లో డాన్స్ చేసి పూజ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. AA19 మూవీ లో మరోసారి జతకట్టారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న AA19 మూవీ కై అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























