ఇటీవల వినరా సోదర వీర కుమారా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస సాయి మథనం అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అజయ్ సాయి మనికందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కాశీ ప్రొడక్షన్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అఫీషియల్ గా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనివాస సాయి సరసన భావన రావ్ హీరోయిన్ గా నటిస్తోంది. గేమ్ ఓవర్ సినిమాకు సంగీతం అందించిన రాన్ ఎహాన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. కాశీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అషోక్ ప్రసాద్, దివ్వ ప్రసాద్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. కో ప్రొడ్యూసర్ – మదన్ తీగల, ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు.
[subscribe]
[youtube_video videoid=6R8Z6h0N9S0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























