మహేష్ #26 టైటిల్ రిలీజ్

SSMB26 Title Revealed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,SSMB26 Title Revealed,Mahesh Babu and Anil Ravipudi New Movie Titled as Sarileru Neekevvaru,Mahesh Babu 26th Film Title,Mahesh Babu Upcoming Movie Title Sarileru Neekevvaru,Interesting Title For Mahesh Babu 26th Film,Mahesh Babu Anil Ravipudi Movie – Sarileru Neekevvaru
SSMB26 Title Revealed

మహర్షి సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26 సినిమాకు అప్పుడే సిద్దమైపోయాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ 26వ సినిమా ఉండబోతుందని మనకు ఇంతకు ముందే తెలుసు. ఈ సినిమా లాంచింగ్ కు ఓ ముహూర్తాన్ని కూడా పెట్టేశారు. మే 31వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉదయం 9.18 నిమిషాలకు అధికారికంగా పూజ కార్యక్రమంతో ఈ సినిమా ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ గ్యాప్ లో మహేష్ అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు. మహేష్ తండ్రి కృష్ణ చేతుల మీదగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు.

కాగా ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. విజయశాంతి మహేష్ బాబుకు అత్తగా నటించబోతున్నట్లు సమాచారం. ఏకే ఎంటర్ టైన్మెంట్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, మహేష్ బాబు, రామ బ్రహ్మం సుంకర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరి మహేశ్ బాబు ‘మాహర్షి’తో భారీ సక్సెస్ ను అందుకున్న తరువాత చేస్తోన్న సినిమా.. ఇక ఇటీవలే ‘ఎఫ్ 2’తో భారీ హిట్ ను కొట్టాడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా.. దీంతో అప్పుడే సినిమా ప్రారంభం కాకముందే భారీ అంచనాలు పెరిగిపోయాయి. మరి మహేశ్ తో అనిల్ రావిపూడి ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

https://www.instagram.com/p/ByGMrTundRV/?utm_source=ig_web_copy_link

[subscribe]

[youtube_video videoid=eTCgaFWwKQA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + fifteen =