బ‌న్నీ, త్రివిక్ర‌మ్ మూవీ అప్‌డేట్స్‌

Allu Arjun and Trivikram New Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun and Trivikram New Movie Shooting News,Allu Arjun New Film Shoot,Allu Arjun and Trivikram Movie Shooting Schedule plans,#AA19 Film Shoot
Allu Arjun and Trivikram New Movie Latest Update

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి ‘నాన్న నేను’, ‘అలకనంద’ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో… మాలీవుడ్ నటుడు జయరామ్ కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఇటీవలే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం… జూన్ మొద‌టి వారం నుంచి త‌దుపరి షెడ్యూల్ జ‌రుపుకోనుంది. ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో కలసి హాలిడే ట్రిప్ కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్ళొచ్చిన బ‌న్నీ… ఇక పూర్తిగా సినిమాపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. ఈ నేప‌థ్యంలోనే… ఈ సినిమాను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఫినిష్ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట బ‌న్నీ. అందుకే నాన్‌స్టాప్ షూటింగ్ ప్లాన్ జ‌రుగుతోంద‌ని స‌మాచారం.

కాగా.. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయ‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఆ త‌రువాత సుకుమార్, వేణు శ్రీ‌రామ్ ఐకాన్‌ చిత్రాల‌పై దృష్టి పెట్ట‌నున్నాడు బ‌న్నీ.

[subscribe]

[youtube_video videoid=lS5CrgkciTo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.