సూపర్ స్టార్ మహేష్ బాబుకి బాగా కలిసొచ్చిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలవడమే కాకుండా… ఆ యా సంవత్సరాలలో హయ్యస్ట్ గ్రాసర్ మూవీస్‌గా నిలిచాయి. అటువంటి కాంబినేషన్ ఇప్పుడు మరోసారి జట్టు కట్టనున్నట్టు టాలీవుడ్ టాక్. అయితే… ఈ సారి దర్శకుడిగా కాకుండా… నిర్మాతగా మహేష్ మూవీలో భాగమవుతున్నాడట కొరటాల.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మహేష్, టాలెంటెడ్ డైరెక్టర్ పరాశురామ్ కలయికలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆరంభం నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించనున్నట్టు ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం… ఇప్పుడు ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్ పతాకంపై తన మిత్రుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి కొరటాల శివ నిర్మిస్తున్నాడని తెలుస్తోంది. కాగా… ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. అంతేకాదు… అనిల్ రావిపూడి చిత్రాన్ని పూర్తి చేశాకే… మహేష్ ఈ చిత్రంపై దృష్టి పెట్టనున్నాడని టాక్.
మరి దర్శకుడిగా మహేష్‌కు అద్భుతమైన విజయాలను అందించిన కొరటాల… నిర్మాతగా ఎటువంటి ఫలితాలను రాబడతాడో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=SVe_MFEHYOQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























